Stock Market: ప్చ్‌.. మళ్లీ 50,000 దిగువకు - Stock Market Ended in Deep Red
close

Updated : 19/05/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: ప్చ్‌.. మళ్లీ 50,000 దిగువకు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజులో కొంత ఊగిసలాట ధోరణి కనబరిచాయి. స్వల్పకాలం పాటు లాభాల్లోకి వెళ్లి తిరిగి నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాల్ని నమోదు చేశాయి. ఉదయం 50,088 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సెన్సెక్స్‌ 50,279 వద్ద గరిష్ఠాన్ని, 49,831 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 290 పాయింట్ల నష్టంతో 49,902 వద్ద ముగిసింది. దాదాపు ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ 15,058 వద్ద ప్రారంభమై 15,133-15,008 మధ్య కదలాడింది. చివరకు 77 పాయింట్ల నష్టంతో 15,030 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.15 వద్ద నిలిచింది.

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల్లో పయనించడం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే గత రెండు రోజుల లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలోనే సూచీలు నష్టాల్లో పయనించాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, బజాజ్‌ఆటో, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, భారతీయ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంకు షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని