Stock Market: లాభాల జోరుకు బ్రేక్‌! - Stock Market Indices Traded Lower
close

Updated : 16/06/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల జోరుకు బ్రేక్‌!

ముంబయి: లోహ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కుదేలవడంతో పాటు రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు వెనుకబడడంతో బుధవారం స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో గత నాలుగు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడడం సూచీలను కిందకు దిగజార్చింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకు దిగజారుతూ పోయాయి. చివరకు సెన్సెక్స్‌ 271 పాయింట్లు కుంగి 52,501 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు దిగజారి 15,767 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.30 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో సెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, టీసీఎస్‌ షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫినాన్స్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని