Stock Market: లాభాల్లో సూచీలు - Stock Market Indices are trading Higher
close

Published : 28/05/2021 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 190 పాయింట్లు లాభపడి 51,305 వద్ద.. నిఫ్టీ 71 పాయింట్లు ఎగబాకి 15,409 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.54 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసుల తగ్గుముఖం పట్టడం సూచీల్లో విశ్వాసం నింపుతోంది. అమెరికాలో మహమ్మారి సంక్షోభం నుంచి బయటపడేందుకు అక్కడి ప్రభుత్వం భారీ ఉద్దీపన పథకాల్ని ప్రవేశపెడుతుండడం అక్కడి సూచీలతో పాటు ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. దీంతో నేడు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. వీటితో పాటు కీలక రంగాల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని