Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు - Stock Market Indices traded higher
close

Published : 26/05/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం స్తబ్ధుగా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ ఇంట్రాడే గరిష్ఠాలకు చేరుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 379 పాయింట్లు లాభపడి 51,017 వద్ద.. నిఫ్టీ 93 పాయింట్లు ఎగబాకి 15,301 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.72 వద్ద నిలిచింది.

దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వార్తలు మదుపర్లను ఉత్సాహపరిచాయి. వీటికి తోడు కీలక రంగాల సూచీలు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది. ఐటీ, ఆర్థికం, స్థిరాస్తి రంగాలు సూచీలను ముందుకు నడిపించాయి. ఈ నేపథ్యంలోనే నేడు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫినాన్స్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని