Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు - Stock Market Indices traded higher
close

Published : 07/06/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నప్పటికీ.. తిరిగి పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలకు చేరుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 228 పాయింట్లు ఎగబాకి 52,328 వద్ద ముగియగా.. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 15,751  వద్ద స్థిరపడింది.  డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.80 వద్ద నిలిచింది. 

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడం, రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటం మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఏడు మినహా అన్ని షేర్లు లాభాల్లో ముగిశాయి.పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్ మహీంద్రా, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు రాణించగా.. బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని