Stock Market: కొనసాగిన లాభాల పరంపర - Stock Market Traded Higher
close

Updated : 10/05/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: కొనసాగిన లాభాల పరంపర

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాల పరంపర కొనసాగించింది. సోమవారం సెన్సెక్స్‌ 295 పాయింట్లు లాభపడి 49,502 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు ఎగబాకి 14,942 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.35 వద్ద నిలిచింది. 

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఉండటం, కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడం, వ్యాక్సిన్‌, ఔషధాల కొరత  వంటి ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో పయనిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు విదేశీ ఆర్డర్లు భారీగా పుంజుకోవడం, కంపెనీల నాలుగో త్రైమాసికం ఫలితాలు బలంగా ఉండడం సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. అలాగే తాజా కరోనా విజృంభణ వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని.. కేవలం పునరుత్తేజం మాత్రమే ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న అంచనాల నుంచి మదుపర్లు సానుకూల సంకేతాలు అందకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. 

సెన్సెక్స్ 30లో ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. అల్ట్రాటెక్ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని