Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి - Stock Market ended on a flat note
close

Published : 25/05/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ దిగజారుతూ వచ్చాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 50,474 వద్ద, నిఫ్టీ 15,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్‌ 14 పాయింట్లు కోల్పోయి 50,637 వద్ద.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 15,208 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.77 వద్ద నిలిచింది. 

అంతర్జాతీయం సంకేతాలతో ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలకు కొత్త వార్తలేమీ లేకపోవడంతో నేల చూపులు చూశాయి. ఇక వ్యాక్సిన్ల కొరత, బ్లాక్ ఫంగస్‌ కేసులు ఇంకా మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఇక గత రెండు సెషన్ల భారీ లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఆర్థిక, విద్యుత్తు, బ్యాంకింగ్‌, ఇంధన రంగ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. 

ఇక బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాలు చవిచూడగా.. ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని