Stock Market: కొత్త రికార్డుల్లో సూచీలు - Stock Market indices at new highs
close

Published : 15/06/2021 09:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: కొత్త రికార్డుల్లో సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల అండతో సూచీలు కొత్త రికార్డుల్లో పరుగులు పెడుతున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ఉండగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 16వేల మార్క్‌కు మరింత చేరువైంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 248 పాయింట్లు ఎగబాకి 52,800 వద్ద, నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 15,878 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తదితర షేర్లు రాణిస్తున్నాయి.

ఇక క్రితం సెషన్‌లో కుప్పకూలిన అదానీ గ్రూప్‌ షేర్లు నేడు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ గ్రూప్‌ షేర్లలో రూ.43,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింపజేసినట్లు వచ్చిన వార్తలతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్‌ షేర్ల విలువ 5-25 శాతం వరకు పతనమైన విషయం తెలిసిందే. అయితే ఖాతాలను స్తంభింపజేయలేదని అటు కంపెనీ, ఇటు ఎన్‌ఎస్‌డీఎల్‌ స్పష్టం చేసింది. దీంతో ఈ గ్రూప్‌ షేర్లు కాస్త కోలుకున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని