Stock Market: స్వల్ప లాభాల్లో సూచీలు - Stock Markets Are opening low
close

Published : 18/06/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: స్వల్ప లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 52,373 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 03 పాయింట్లు ఎగబాకి 15,694 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.10 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లలో గురువారం ఐటీ షేర్లు రాణించాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా ఐటీ, సాంకేతికత రంగ షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, టైటన్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని