ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - Stock Markets closed on Flat
close

Published : 12/02/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం 83 పాయింట్ల లాభంతో 51,614 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 12 పాయింట్ల స్వల్ప లాభంతో 51,544 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. అదే సమయంలో నిఫ్టీ 13 పాయింట్లు ఎగబాకి 15,186 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించగా.. చివరకు 10 పాయింట్లు నష్టపోయి 15,163 వద్ద స్థిరపడింది. ఓ దశలో అమ్మకాల ఒత్తిడికి గరైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 51,283 వద్ద కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం 81 పాయింట్లు కోల్పోయి 15,092 వద్ద కనిష్ఠాన్ని చవిచూసింది. బ్యాంకింగ్‌, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచినప్పటికీ.. ఆటో, ఇన్‌ఫ్రా, టెలికాం, లోహ రంగ షేర్లు లాభాలను కట్టడి చేశాయి.

అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో లిమిటెడ్‌, షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. ఐటీసీ లిమిటెడ్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్ని చవిచూశాయి. ఐటీసీ షేర్లు 4శాతం మేర నష్టపోయాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని