close

Updated : 22/01/2021 07:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీల అనుమతి

వాటాదార్ల అనుమతి పొందాలి

దిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌కు చెందిన రిటైల్‌ ఆస్తులను రూ.24,713 కోట్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)కు విక్రయించడానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అనుమతినిచ్చాయి. అయితే ఇందుకు కొన్ని షరతులను విధించాయి. అయితే ఇందుకోసం వాటాదార్లతో పాటు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అనుమతులను పొందాల్సి ఉంటుంది. ‘ప్రస్తుతం జరుగుతున్న న్యాయ వివాదాలు/మధ్యవర్తిత్వాలు/న్యాయ ప్రక్రియల నుంచి సంబంధిత అథారిటీ/కోర్టుల నుంచి వెలువడే నిర్ణయంపై’ ఆధారపడి ఒప్పందం ముందుకు సాగుతుందని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు విడివిడిగా పేర్కొన్నాయి.. ఇప్పటికే ఈ ఒప్పందానికి సెబీ సైతం అనుమతులిచ్చిన విషయం తెలిసిందే.  
స్పష్టంగా చెప్పాయి కదా: అమెజాన్‌
‘ప్రతిపాదిత లావాదేవీ ప్రస్తుత మధ్యవర్తిత్వ, న్యాయ వివాదాల తీర్పులకు లోబడి ఉంటుంద’ని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు వెలువరచిన లేఖలు స్పష్టంగా చెప్పాయని అమెజాన్‌ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపింది.


సంక్షిప్తంగా

* ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌ 10 కోట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. కంపెనీ 1984 జనవరి 19న మొదటి మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. వచ్చే అయిదేళ్లలో వృద్ధి కొనసాగించడానికి ఏటా 10కి పైగా కొత్త మోడళ్లు విడుదల చేస్తామని తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.
* స్టోవ్‌ క్రాఫ్ట్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 28న ముగియనుంది. రూ412 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.384- 385ను నిర్ణయించారు.
* 2020 సెప్టెంబరు త్రైమాసికంలో టెలికాం సంస్థల స్థూల ఆదాయం 13.73 శాతం వృద్ధితో రూ.68,228 కోట్లకు చేరింది. 2019 ఇదే త్రైమాసికంలో కంపెనీల స్థూల ఆదాయం రూ.59,992 కోట్లుగా ఉందని ట్రాయ్‌ తెలిపింది.
* ఈ ఏడాది భారత్‌లో 25 కొత్త వాహనాలు తీసుకురావడానికి బీఎండబ్ల్యూ సన్నాహాలు చేస్తోంది. కంపెనీ గురువారం విపణిలోకి బీఎండబ్ల్యూ 3 సిరీస్‌ గ్రాన్‌ లైమోసిన్‌ కారును విడుదల చేసింది. దీని ధర రూ.51.5- 53.9 లక్షలుగా నిర్ణయించారు.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండు ప్రతిపాదనను పరిశీలించడానికి సన్‌ఫార్మా బోర్డు నేడు సమావేశం కానుంది.
* రియల్‌ టైమ్‌ మార్కెట్‌ డేటా టెర్మినళ్లను అందించే కోజెన్సీస్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ను ఎన్‌ఎస్‌ఈ అనుంబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ డేటా అండ్‌ అనలిటిక్స్‌ కొనుగోలు చేసింది. లావాదేవీ వివరాలను వెల్లడించలేదు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని