Stock Market: 4 రోజుల లాభాలకు బ్రేక్‌! - Stock market closes lower
close

Updated : 11/05/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: 4 రోజుల లాభాలకు బ్రేక్‌!

ముంబయి: వరుసగా గత నాలుగు సెషన్లలో లాభపడ్డ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు డీలా పడ్డాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా నష్టాల్లోనే పయనించాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. చివరకు సెన్సెక్స్‌ 340 పాయింట్లు కోల్పోయి 49,161 వద్ద.. నిఫ్టీ 91 పాయింట్లు దిగజారి 14,850 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.33 వద్ద ముగిసింది.

అమెరికా మార్కెట్లు సోమవారం ప్రతికూలంగా ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడాయి. వీటికి తోడు కరోనా భయాలు మదుపర్లను వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే కీలక రంగాల షేర్లన్నీ నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా కేసుల విజృంభణ ఇలాగే కొనసాగితే భారత వృద్ధి రేటు 8.2 శాతానికి పడిపోవచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. అలాగే వరుసగా నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు నష్టాల్లో పయనించాయి.

సెన్సెక్స్‌ 30 జాబితాలో కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌ షేర్లు నష్టాల్లో పయనించాయి. ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, రిలయన్స్‌, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌, ఏషియన్‌ పెయింట్‌ షేర్లు లాభాల్ని ఒడిసిపట్టాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని