ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు - Stock market closing bell
close

Updated : 16/04/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలున్నప్పటికీ నేడు దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా లాభాల్లో కొనసాగిన సూచీలు చివరకు చతికిలపడ్డాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. తిరిగి వెంటనే పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. 48,935 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్ కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో 49,089 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ 14,599 వద్ద ప్రారంభమై 14,559 - 14,697 మధ్య కదలాడింది. అయితే, ఈ వారం చివరి ట్రేడింగ్‌ సెషన్‌ కావడంతో మదుపర్లు ఇంట్రాడే లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్‌ 28 పాయింట్ల స్వల్ప లాభంతో 48,832 వద్ద ముగియగా.. నిఫ్టీ 36 పాయింట్లు ఎగబాకి 14,617 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.35 వద్ద స్థిరపడింది. అమెరికా, ఐరోపాతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. దీనికి తోడు గత త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 18.3 శాతంగా నమోదు కావడం మదుపర్లలో ఉత్సాహం నింపింది.

గురువారం వెలువడిన విప్రో నాలుగో త్రైమాసికం ఫలితాలు అంచనాలు మించడంతో నేడు ఆ కంపెనీ షేర్లు ఓ దశలో ఏకంగా 10 శాతం మేర లాభపడ్డాయి. హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సిప్లా, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో పయనించగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, స్థిరాస్తి, ఇంధన రంగ షేర్లు నష్టపోవడం సూచీలను ఒకింత కట్టడి చేశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని