Stock market: భారీ నష్టాల్లో సూచీలు - Stock market indices are in deep red
close

Updated : 21/06/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: భారీ నష్టాల్లో సూచీలు

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 351 పాయింట్లు నష్టపోయి 51,993 వద్ద.. నిఫ్టీ 114 పాయింట్లు దిగజారి 15,568 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.25 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. వీటితో పాటు దేశీయంగా వాహన, ఆటో వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీలు నష్టాల బాటపట్టాయి. 

బీఎస్‌ఈ 30 సూచీలో ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా మినహా మిగిలిన కంపెనీలన్నీ నష్టాలు చవిచూస్తున్నాయి. ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ నష్టాలను మూటగట్టకుంటున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని