Stock market: ఆరంభ లాభాలు ఆవిరి - Stock market indices are in green
close

Updated : 22/06/2021 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆరంభ లాభాలు ఆవిరి

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు డీలా పడ్డాయి. ఓ దశలో 483 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 53,057 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో భారీ లాభాల  వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు డీలాపడ్డాయి. చివరకు సెన్సెక్స్‌ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 52,588 వద్ద.. నిఫ్టీ 26 పాయింట్లు ఎగబాకి  వద్ద 15,772 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.38 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు సానుకూలంగా కదలాడాయి. 

బీఎస్‌ఈ 30 సూచీలో మారుతీ, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ముగియగా.. ఏషియన్ పెయింట్స్‌, బజాజ్ ఫినాన్స్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్‌, టెక్ మహీంద్రా, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని