Stock Market: సూచీల్లో అప్రమత్తత! - Stock market indices are moving cautiously
close

Updated : 04/06/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: సూచీల్లో అప్రమత్తత!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 10 పాయింట్ల లాభంతో 52,242 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 3 పాయింట్లు స్వల్పంగా లాభపడి వద్ద 15,693 ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.05 వద్ద కొనసాగుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ,టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. నెస్లే ఇండియా, టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని