లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Stock market indices are trading higher
close

Published : 10/05/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 360 పాయింట్లు ఎగబాకి 49,566 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 117 పాయింట్లు లాభపడి 14,940 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.31 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. అలాగే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉండదని కేంద్రం గతవారం స్పష్టం చేసింది. విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాలు సూచీల కదలికలకు దన్నుగా నిలుస్తున్నాయి. అయితే, దేశంలో భారీ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండడం, మెజారిటీ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం, అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ అంచనాల్లో కోతపెట్టడం వంటి అంశాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగానే వ్యవహరించే అవకాశం ఉంది. 

సెన్సెక్స్30 సూచీలో ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో పయనిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. నేడు ఆర్టెమిస్‌ మెడికేర్‌ సర్వీసెస్‌, చంబల్‌ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, హెచ్‌ఎస్‌ఐఎల్‌, న్యూట్రీసర్కిల్‌ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెలవరించనున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని