Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు - Stock market indices closed on a flat note
close

Updated : 14/05/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఆద్యంతం ఊగిసలాట ధోరణి కనబరిచాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు కాసేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లీ అంతలోనే కోలుకొని స్వల్పకాలం లాభాల్లో కొనసాగాయి. ఇలా రోజంతా సూచీల పయనం ఒడుదొడుకులమయంగా సాగింది. చివరకు సెన్సెక్స్‌ 41 పాయింట్ల స్వల్ప లాభంతో 48,732 వద్ద ముగియగా.. నిఫ్టీ 18 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,677 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.28 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. కొవిడ్‌ భయాలు మదుపర్లను వెంటాడాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోని అస్థిరత, వ్యాక్సినేషన్‌పై కొనసాగుతున్న అనిశ్చితి సైతం మదుపర్లను అప్రమత్తం చేశాయి. ఇక కీలక రంగాల షేర్లు రాణించకపోవడం సూచీలపై ప్రభావం చూపింది. 

బీఎస్‌ఈ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌ ఏకంగా 8.49 శాతం లాభాలను ఒడిసిపట్టింది. ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని