Stock market: ఆద్యంతం ఊగిసలాట! - Stock market indices ended in red
close

Updated : 23/06/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆద్యంతం ఊగిసలాట!

ముంబయి: తీవ్ర ఊగిసలాట మధ్య బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు దాదాపు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. చివర్లో మాత్రం కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఆటో రంగంలో లభించిన కొనుగోళ్ల మద్దతు.. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల్లో వెల్లువెత్తిన అమ్మకాల రూపంలో ఆవిరడంతో సూచీలు ఊగిసలాట ధోరణి ప్రదర్శించాయి. చివరకు సెన్సెక్స్‌ 282 పాయింట్లు దిగజారి 52,306 వద్ద ముగియగా.. నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 15,686 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.24 వద్ద నిలిచింది.

సెన్సెక్స్ 30 సూచీలో మారుతీ, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎంఅండ్‌ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. ఎల్అండ్‌టీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని