Stock market : ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు! - Stock market indices opened in Flat
close

Published : 22/09/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market : ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. సూచీలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్న నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కనిష్ఠాలకు చేరిన తర్వాత అమ్మకాలూ వెల్లువెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 110 పాయింట్ల లాభంతో 59,116 వద్ద.. నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 17,592 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.71 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం షేర్లు రాణిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని