Stock market : లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు! - Stock market indices opened in Green
close

Published : 21/09/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market : లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లపై చైనా స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండే సంక్షోభం ప్రభావం చూపింది. అక్కడి మూడు ప్రధాన సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం ఇదే కారణంతో అప్రమత్తంగా కదలాడుతున్నాయి. మరోవైపు భారీ స్థాయిల నుంచి సూచీలు సోమవారం కనిష్ఠాలకు చేరడంతో ఆరంభంలో అమ్మకాలు వెల్లువెత్తొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 190 పాయింట్లు లాభపడి 58,681 వద్ద.. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17,454 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.58 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్ పెయింట్స్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, టైటన్‌, ఎన్‌టీపీసీ షేర్లు రాణిస్తున్నాయి. మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని