Stock market Opening bell: కొనసాగుతున్న లాభాలు! - Stock market indices opened in green
close

Updated : 15/09/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market Opening bell: కొనసాగుతున్న లాభాలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. చైనా ఆర్థిక గణాంకాలు నిరాశపరచడంతో దాదాపు అన్ని ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఇలా అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు లాభాల్లో కొనసాగుతుండడం విశేషం. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 113 పాయింట్లు లాభపడి 58,363 వద్ద.. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 17,416 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.70 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ షేర్లు రాణిస్తున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని