Stock market : కొనసాగుతున్న మార్కెట్ల జైత్రయాత్ర - Stock market indices opened in green
close

Updated : 17/09/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market : కొనసాగుతున్న మార్కెట్ల జైత్రయాత్ర

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా కదలాడాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా పయనిస్తున్నాయి. పలు రంగాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించడం మదుపర్లలో విశ్వాసం పెంచింది. తాజాగా బ్యాడ్ బ్యాంక్‌కు రూ.30,600 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించడం బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీకి కారణమైంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై విదేశీ మదుపర్ల విశ్వాసం బలపడింది. వీటికి తోడు ఐపీఓల పరంపర సైతం సూచీలకు దన్నుగా నిలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల పోకడను సైతం పట్టించుకోకుండా దేశీయ మార్కెట్లు రాణిస్తున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 425 పాయింట్లు లాభపడి 59,566 వద్ద.. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 17,743 వద్ద జీవనకాల గరిష్ఠాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.51 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. బజాజ్‌ ఫినాన్స్‌, ఐటీసీ, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు అధికంగా రాణిస్తున్నాయి. టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని