close

Published : 04/05/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. అలాగే కీలక రంగాల షేర్లు రాణిస్తుండండం కూడా సూచీల సెంటిమెంటును పెంచాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 79 పాయింట్లు లాభపడి 48,797 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 35 పాయింట్లు ఎగబాకి 14,669వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కొవిడ్‌ భయాలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగమనం నేపథ్యంలో సూచీలు ఎంతమేర లాభాల్లో కొనసాగుతాయన్నది చూడాల్సి ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎనిమిది మినహా మిగతా అన్ని కంపెనీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌యూఎల్‌, టైటన్‌, రిలయన్స్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని