Covid భయాల్లోనూ కొనసాగుతున్న లాభాలు - Stock market indices trade Higher
close

Published : 28/04/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid భయాల్లోనూ కొనసాగుతున్న లాభాలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనిస్తున్నాయి. బుధవారం ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 371 పాయింట్ల లాభంతో 49,315 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 14,752  వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కొనసాగుతున్నాయి. దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రభుత్వం త్వరితగతిన చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న యత్నాలు మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ సహా అంతర్జాతీయంగా భారత్‌కు సహకారం లభిస్తుండడంతో మహమ్మారి విజృంభణకు త్వరలో అడ్డుకట్ట పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు మదుపర్లలో విశ్వాసం నింపింది. వీటికి తోడు కీలక రంగాల సూచీలు, ప్రముఖ కంపెనీలు రాణిస్తుండడంతో సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బయోకాన్‌, టాటా కమ్యూనికేషన్స్‌ సహా మొత్తం 21 కంపెనీలు నేడు త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, దివీస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా... హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, మారుతీ సుజుకీ ఇండియా, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని