వరుసగా మూడోరోజూ లాభాల జోరు! - Stock market indices trade Higher
close

Updated : 28/04/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా మూడోరోజూ లాభాల జోరు!

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. బుధవారం ఆద్యంతం లాభాల జోరును కనబరిచాయి. ఉదయం 49,066 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 49,801 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు  789 పాయింట్ల లాభంతో 49,733 వద్ద ముగిసింది. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 14,864  వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద నిలిచింది. 

అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కొనసాగాయి. దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రభుత్వం త్వరితగతిన చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న యత్నాలు మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ సహా అంతర్జాతీయంగా భారత్‌కు సహకారం లభిస్తుండడంతో మహమ్మారి విజృంభణకు త్వరలో అడ్డుకట్ట పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు మదుపర్లలో విశ్వాసం నింపింది. వీటికి తోడు కీలక రంగాల సూచీలు, ప్రముఖ కంపెనీలు రాణించడంతో సూచీలు లాభాల్లో కదలాడాయి. 

బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా... బ్రిటానియా, హిందాల్కో ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, నెస్లే ఇండియా, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని