నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Stock market indices trade Higher
close

Updated : 30/04/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 354 పాయింట్లు నష్టపోయి 49,411 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 82 పాయింట్లు దిగజారి 14,812 వద్ద కొనసాగుతోంది. 

అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. వరుసగా నాలుగు రోజుల పాటు సూచీలు లాభాల్లో కొనసాగడంతో నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొవిడ్‌ భయాలు, రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడో విడత వ్యాక్సినేషన్‌పై టీకాల కొరత ప్రభావం వంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. మరోవైపు చైనాలో ఏప్రిల్‌ నెల తయారీ కార్యకలాపాలు నెమ్మదించాయన్న వార్తలు ఆసియా మార్కెట్ల దిద్దుబాటుకు కారణమైంది. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై కనిపిస్తోంది. 

విప్రో లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా... హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టైటన్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని