Stock market: సరికొత్త గరిష్ఠానికి నిఫ్టీ - Stock market indices traded higher
close

Published : 31/05/2021 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సరికొత్త గరిష్ఠానికి నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొంత సమయానికే లాభాల్లోకి ఎగబాకి ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ నేటి ట్రేడింగ్‌లో ఓ దశలో 171 పాయింట్లు లాభపడి 15,606 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 15,582 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 514 పాయింట్లు ఎగబాకి 51,937 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.61 వద్ద నిలిచింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ పురోగతి సూచీలకు దన్నుగా నిలిచాయి. వీటితో పాటు రిలయన్స్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు రాణించడంతో సూచీలు లాభాల బాటలో పయనించాయి. 

బీఎస్‌ఈ 30 సూచీలో రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, మారుతీ, ఐటీసీ, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా ఎల్‌అండ్‌టీ, బజాజ్‌  ఆటో షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని