Stock market:స్తబ్ధుగా ప్రారంభమైన సూచీలు - Stock market indices trading flat note
close

Updated : 26/05/2021 09:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market:స్తబ్ధుగా ప్రారంభమైన సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల్లో పయనిస్తుండడం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 19 పాయింట్లు లాభంతో 50,648 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 04  పాయింట్లు నష్టపోయి 15,204 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.75 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో టైటన్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..పవర్‌ గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని