Stock market:స్తబ్ధుగా ప్రారంభమైన సూచీలు - Stock market indices trading flat note
close

Updated : 08/06/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market:స్తబ్ధుగా ప్రారంభమైన సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 35 పాయింట్ల లాభంతో 52,364 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 15,766 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.79 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ  జీవనకాల గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభాలకు స్వీకరణకు మొగ్గుచూపే సూచనలు కనిపిస్తున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టీసీఎస్‌, ఐటీసీ, మారుతీ, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని