Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు - Stock market indices trading higher
close

Published : 24/05/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాలతో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. అయినా, వెంటనే కోలుకొని రోజంతా అదే జోరును కొనసాగించాయి. చివరకు సెన్సెక్స్‌ 111 పాయింట్లు లాభపడి 50,651  వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు ఎగబాకి 15,197 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.93 వద్ద నిలిచింది.

కరోనా వ్యాప్తి తగ్గుతుండడంతో పాటు, టీకాల ఉత్పత్తి పెంచే యత్నాలు వేగవంతం కావడంతో మార్కెట్‌లో సానకూల సెంటిమెంటు మెరుగుపడింది. కీలక రంగాల్లోని షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. అయితే, కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్‌ కేసులు వెలుగులోకి రావడం సూచీల్లోని లాభాల్ని ఒకింత కట్టడి చేశాయనే చెప్పాలి. ఆసియా సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో పయనించగా.. ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాలు ఒడిసిపట్టాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని