Stock Market: నష్టాల్లో సూచీలు - Stock market indices trading lower
close

Published : 11/05/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: నష్టాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల నాలుగు రోజుల లాభాల పరుగుకు మంగళవారం ఉదయం సెషన్‌లో బ్రేక్‌ పడింది. రెండు ప్రధాన సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 437 పాయింట్లు కోల్పోయి 49,034 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 141 పాయింట్లు దిగజారి 14,800 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.52 వద్ద కొనసాగుతోంది. 

అమెరికా మార్కెట్లు సోమవారం ప్రతికూలంగా ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందకున్న ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. వీటికి తోడు కరోనా భయాలు మదుపర్లను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే కీలక రంగాల షేర్లన్నీ నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా కేసుల విజృంభణ ఇలాగే కొనసాగితే భారత వృద్ధి రేటు 8.2 శాతానికి పడిపోవచ్చని ఫిచ్‌ అంచనా వేసింది. అలాగే వరుసగా నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతన్న సంకేతాలూ కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు నష్టాల్లో పయినిస్తున్నాయి. 

సెన్సెక్స్‌ 30 జాబితాలో వవర్‌ గ్రిడ్‌, సన్‌ ఫార్మా మినహా దాదాపు అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెడ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఓన్‌జీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని