Stock market: స్వల్ప నష్టాల్లో సూచీలు - Stock market indices trading lower
close

Updated : 19/05/2021 16:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: స్వల్ప నష్టాల్లో సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల సూచీలు నష్టాల్లో పయనిస్తుండడం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలుస్తోంది. అలాగే నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 85 పాయింట్లు దిగజారి 50,123 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 15,084 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.04 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు ప్రతికూలంగానే కదలాడుతున్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని