Stock market: ఊగిసలాటలో సూచీలు - Stock market running in volatality
close

Updated : 23/06/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఊగిసలాటలో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల దిశగా పయనించాయి. తిరిగి వెంటనే కిందకు దిగజారుతూ వచ్చాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 19 పాయింట్లు లాభపడి 52,608 వద్ద.. నిఫ్టీ 16 పాయింట్లు ఎగబాకి 15,788 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.31 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో షేర్ల విలువ నిన్న పెరగటంతో మదుపర్లు నేడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. 

బీఎస్‌ఈ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టైటన్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని