Stock Market: వరుసగా రెండో రోజూ నష్టాలే! - Stock market traded lower today
close

Published : 12/05/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: వరుసగా రెండో రోజూ నష్టాలే!

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నష్టాల్లో పయనించాయి. చివరకు సెన్సెక్స్‌ 471 పాయింట్లు నష్టపోయి 48,690 వద్ద.. నిఫ్టీ 151 పాయింట్లు దిగజారి 14,696 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.42 వద్ద నిలిచింది.

కమొడిటీ ధరలు దూసుకెళ్లడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ద్రవ్యోల్బణ భయం, కమొడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు, బాండ్ల రాబడులు పెరగొచ్చన్న అంచనాలతో నేడు అప్రమత్తంగా కదలాడాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు, కొవిడ్‌ భయాలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీశాయి.

సెన్సెక్స్‌ 30 జాబితాలో టైటన్‌, పవర్‌గ్రిడ్‌, మారుతీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్ షేర్లు లాభాల్లో పయనించగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని