Stock Market: లాభాల్లో సూచీలు - Stock market trading Higher
close

Updated : 21/05/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ముందుకు సాగుతున్నాయి. ఉదయం 9:41 గంటల సమయంలో సెన్సెక్స్‌ 428 పాయింట్లు లాభపడి 49,993 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగబాకి 15,030 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.02 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల నష్టాల నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండడం కూడా సూచీలకు దన్నుగా నిలుస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం కూడా సూచీలకు కలిసి వస్తోంది. 

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్లో పయనిస్తుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఓఎన్‌జీసీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని