Stock Market: నష్టాల్లో సూచీలు - Stock market trading lower
close

Updated : 12/05/2021 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: నష్టాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 340 పాయింట్లు నష్టపోయి 48,810 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 94 పాయింట్లు దిగజారి 14,756 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.50 వద్ద ట్రేడవుతోంది.

కమొడిటీ ధరలు దూసుకెళ్లడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు ద్రవ్యోల్బణ భయం, కమొడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు, బాండ్ల రాబడులు పెరగొచ్చన్న అంచనాలతో నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. వీటికి తోడు కీలక రంగాల్లో అమ్మకాలు, కొవిడ్‌ భయాలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి.

సెన్సెక్స్‌ 30 జాబితాలో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని