Stock market: లాభాల జోరు - Stock markets Ended in green
close

Updated : 05/07/2021 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల జోరు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయమే ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు ఆద్యంతం అదే జోరును కొనసాగించాయి. స్థిరాస్తి, లోహ, బ్యాంకింగ్‌ రంగ సూచీలు మార్కెట్లను ముందుకు నడిపించాయి. చివరకు సెన్సెక్స్ 395 పాయింట్ల లాభంతో 52,880 వద్ద.. నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 15,834 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.30 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్ ఫినాన్స్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టెక్ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటన్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని