Stock market: ఆద్యంతం నష్టాల్లోనే - Stock markets Ended in red
close

Updated : 29/06/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆద్యంతం నష్టాల్లోనే

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల సూచీలు మంగళవారం ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకుని.. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఆసియా మార్కెట్లు డీలా పడడంతో కుంగిన సూచీలకు ఎక్కడా మద్దతు లభించలేదు. కీలక రంగాల్లో అమ్మకాలు కొనసాగాయి. కేంద్రం సోమవారం ప్రకటించిన ఉపశమన కార్యక్రమాలు మార్కెట్లలో ఉత్సాహం నింపలేకపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ చివరకు 185 పాయింట్ల నష్టంతో 52,549 వద్ద.. నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 15,748 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్ ఫినాన్స్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని