Stock market: రోజంతా నష్టాల్లోనే - Stock markets Ended in red
close

Updated : 11/07/2021 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: రోజంతా నష్టాల్లోనే

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు రోజులో ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. పలు దేశాల్లో కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ కేసులు పెరగడంతో పాటు రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్‌ రిజర్వు వ్యాఖ్యలు అంతర్జాతీయ సూచీలను కలవరపెట్టాయి. వీటికి తోడు బాండ్ల రాబడులు పెరగడం సూచీల నేలచూపులకు కారణమైంది. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక, స్థిరాస్తి, ఆటో రంగాల షేర్ల్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 52,228 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 182 పాయింట్లు నష్టపోయి 52,386 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు దిగజారి 15,689 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, మారుతీ, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని