Stock market: ఆరంభ లాభాలు ఆవిరి - Stock markets Ended in red
close

Updated : 12/07/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆరంభ లాభాలు ఆవిరి

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం ఒంటిగంట వరకు లాభాల్లోనే కొనసాగాయి. అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ 0.5 శాతం పడడంతో సూచీలు ఒక్కసారిగా కిందకు దిగజారాయి. దీంతో టెలికాం, ఐటీ, విద్యుత్తు రంగాలు సహా టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌ వంటి కీలక కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సూచీలు ఆరంభ లాభాలను జార విడిచాయి. ఓ దశలో సెన్సెక్స్‌ 52,700 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ తిరిగి 52,208 వద్ద కనిష్ఠాన్ని చవిచూసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 13 పాయింట్లు నష్టపోయి 52,372 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 02 పాయింట్ల స్వల్ప లాభంతో 15,692 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్ రెడ్డీస్‌, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ముగియగా.. టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని