Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. దుమ్మురేపిన జొమాటో! - Stock markets Ends Igreen Zomms Zooms 66 pc
close

Updated : 23/07/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో ముగిసిన సూచీలు.. దుమ్మురేపిన జొమాటో!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ, కీలక రంగాల నుంచి మద్దతు లభించడంతో తిరిగి పుంజుకుని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. చివరకు సెన్సెన్స్‌ 138 పాయింట్ల లాభంతో 52,975 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 15,856 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా,  టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ ఎం షేర్లు లాభాల్లో ముగియగా.. ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

దుమ్మురేపిన జొమాటో..

స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నేడే తొలిసారి నమోదైన జొమాటో షేర్లు దుమ్ము రేపాయి. ఈ కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.76 కాగా.. దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్టయ్యింది. చివరకు 66 శాతం లాభంతో రూ.126 వద్ద స్థిరపడింది. లిస్టయిన తొలిరోజే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1 లక్ష కోట్లకు చేరుకోవడం విశేషం. మార్కెట్‌ విలువ ఆధారంగా బీఎస్‌ఈ టాప్‌ 50 జాబితాలోకి చేరింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని