Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలకు లాభాల కళ! - Stock markets Ends In Green
close

Updated : 02/08/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలకు లాభాల కళ!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో గతవారం నష్టాల్లో నడిచిన మార్కెట్లు ఎట్టకేలకు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి దిగ్గజ కంపెనీల నుంచి నేడు సూచీలకు మద్దతు లభించింది. వీటికి తోడు ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్‌ 363 పాయింట్ల లాభంతో 52,950 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 15,885 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.32 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టైటన్‌, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్‌, రిలయన్స్‌, టీసీఎస్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, సన్‌షార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని