Stock market: కొనసాగిన లాభాల పరంపర.. జీవనకాల గరిష్ఠాలకు సూచీలు - Stock markets Ends In Green
close

Updated : 04/08/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: కొనసాగిన లాభాల పరంపర.. జీవనకాల గరిష్ఠాలకు సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల జోరు బుధవారమూ కొనసాగింది. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌ తొలిసారి 54 వేల మార్క్‌ను దాటింది. నిన్న 16 వేల మైలురాయిని దాటిన నిఫ్టీ నేడూ దూసుకెళ్లింది. రెండు సూచీలు ఈ రోజు తాజా జీవనకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. చివరకు సెన్సెక్స్‌ 546 పాయింట్లు లాభపడి 54,369 వద్ద.. నిఫ్టీ 128 పాయింట్లు ఎగబాకి 16,258 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.13 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగియగా.. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడాయి. వీటికి తోడు దేశీయంగా వ్యాక్సినేషన్‌ పురోగతి, వాహన విక్రయాలు, సానుకూల త్రైమాసిక ఫలితాలు, తయారీ కార్యకలాపాల వంటి అంశాలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. అలాగే కీలక కంపెనీలు రాణించడం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టైటన్‌, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, సన్‌ ఫార్మా, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని