Stock market: ఆరంభ లాభాలు ఆవిరి - Stock markets Ends In Red
close

Updated : 27/07/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఆరంభ లాభాలు ఆవిరి

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని అమ్మకాల ఒత్తిడి దేశీయ సూచీలపై పడింది. దీంతో మెజారిటీ రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. చివరకు సెన్సెన్స్‌ 273 పాయింట్ల నష్టంతో 52,578 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 15,746 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.48 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, బజాజ్ ఫినాన్స్‌, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఏషియన్ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని