Stock market: చివర్లో వెల్లువెత్తిన అమ్మకాలు! - Stock markets Ends In Red
close

Published : 30/07/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: చివర్లో వెల్లువెత్తిన అమ్మకాలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఇంట్రాడే గరిష్ఠాలకు చేరాయి. అయితే, కీలక రంగాల్లో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో గరిష్ఠాల నుంచి సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 66 పాయింట్ల నష్టంతో 52,586 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 15,763 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.43 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఫినాన్స్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టైటన్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. లోహ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలు సూచీలను కిందకు లాగాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని