Stock market: రెండో రోజూ నష్టాలే.. - Stock markets Ends in red
close

Updated : 20/07/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: రెండో రోజూ నష్టాలే..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజైన మంగళవారమూ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై మదుపర్లలో సందేహాలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ నష్టాల్లో పయనిస్తున్నాయి. స్థిరాస్తి, లోహ, విద్యుత్తు, టెలికం, బ్యాంకింగ్‌ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ దశలో 52,013 వద్ద సెన్సెక్స్‌..15,578 వద్ద నిఫ్టీ ఇంట్రాడే కనిష్ఠాల్ని తాకాయి. చివరకు సెన్సెన్స్‌ 354 పాయింట్ల నష్టంతో 52,198 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయి 15,632 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఏషియన్స్ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా, మారుతీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని