Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు - Stock markets Ends red
close

Published : 19/07/2021 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లను కుంగదీశాయి. దీంతో ఆర్థికం, బ్యాంకింగ్‌, లోహ, టెలికాం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడం సూచీలపై ప్రభావం చూపింది. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజంపై మదుపర్లలో సందేహాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 586 పాయింట్ల నష్టంతో 52,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.87 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫినాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, టైటన్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని