Stock market: ఫ్లాట్‌గా సూచీలు - Stock markets are in Flat
close

Updated : 02/07/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఫ్లాట్‌గా సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 17 పాయింట్ల లాభంతో 52,330 వద్ద.. నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 15,684 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.61 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా  కదలాడుతున్నాయి. దేశీయంగా ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడం, తయారీ రంగ గణాంకాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, టైటన్‌, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని