Stock market: లాభాల్లో సూచీలు - Stock markets are in Green
close

Published : 27/07/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 52,970 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 15,869 వద్ద కొనసాగుతోంది. టెక్ కంపెనీలపై చైనా నియంత్రణతో పడిపోయిన ఆసియా సూచీలు నేడు కాస్త కోలుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.34 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క అమెరికా సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫినాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఏషియన్ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని